Page Loader
Parva: మహాభారతం కథాంశంతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా 
మహాభారతం కథాంశంతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా

Parva: మహాభారతం కథాంశంతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా 

వ్రాసిన వారు Stalin
Oct 21, 2023
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన కొత్త సినిమాను ప్రకటించారు. 'పర్వ- యాన్ ఎపిక్ టేల్ ఆఫ్ ధర్మ' పేరుతో కొత్త సినిమాను తెరకెక్కించనున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. మహాభారతం కథాంశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. 1979లో మహాభారతం ఆధారంగా డాక్టర్ ఎస్ఎల్ భైరప్ప రచించిన కన్నడ నవల 'పర్వ' దీనికి ప్రేరణ. ఈ సినిమాను 3భాగాల్లో తెరకెక్కించేందుకు వివేక్ అగ్నిహోత్రి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. దర్శకధీరుడు రాజమౌళి కూడా మహాభారతాన్ని తన కలల ప్రాజెక్ట్ అని గతంలోనే పేర్కొన్నారు. దానిని 10భాగాలుగా తెరకెక్కిస్తానని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వివేక్ అగ్నిహోత్రి ట్వీట్