
పవన్ కళ్యాణ్ అభిమానులకు సర్ప్రైజ్: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ లుక్
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో ఉన్నారు. తాజాగా మొదలైన షూటింగ్, శరవేగంగా సాగుతోంది. ఇటీవలే హీరోయిన్ శ్రీలీల కూడా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. ఆల్రెడీ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి పవన్ కళ్యాణ్ ఫోటోలు బయటకు వచ్చాయి. సాధారణ టీ షర్ట్ లో అభిమానులతో ఫోటో దిగుతూ కనిపించాడు పవన్ కళ్యాణ్. ఉస్తాద్ భగత్ సెట్ లో ఈ ఫోటో దిగినట్ట్లు తెలుస్తోంది.
Details
రీమేక్ సినిమాల స్పెషలిస్టుగా హరీష్ శంకర్
ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ లుక్ బాగుందని కామెంట్లు పెడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింప్ పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో గబ్బర్ సింగ్ లాంటి హిట్ సినిమా వస్తుందని ఆశపడుతున్నారు. తమిళంలో విజయం సాధించిన తెరి చిత్రానికి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందుతోందని అంటున్నారు.
ఈ విషయమై చిత్రబృందం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాకపోతే రీమేక్ సినిమాలు తీయడంలో హరీష్ శంకర్ స్టయిల్ కొత్తగా ఉంటుందనీ, ఒరిజినల్ కు అనేక మార్పులు చేసి పవన్ అభిమానులకు కావాల్సిన విధంగా తీస్తారని ఆశిస్తున్నారు.