
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గ్లింప్స్ పై తాజా అప్డేట్
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది తెలిసిపోయింది.
మే 11వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుందని సమాచారం.
గబ్బర్ సింగ్ సినిమా రిలీజై 11 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మే 11వ తేదీన, ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ జరుగుతోందని అంటున్నారు.
ఈ విషయమై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
Details
ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి
వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, రీసెంట్ గా పూర్తయిన ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొన్నాడు.
హైదరాబాద్ లోని స్టూడియోలో జరిగిన ఈ షూటింగ్ లోధమాకా హీరోయిన్ శ్రీలీల కూడా పాల్గొంది.
ఈ సినిమాలో శ్రీలీల, పవన్ కళ్యాణ్ ల మధ్య మంచి మాస్ సాంగ్ ఉండబోతుందని గతంలో వార్తలు వచ్చాయి.
విజయ్ దళపతి నటించిన తమిళ సినిమా తెరి చిత్రానికి తెలుగు రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు. కాకపోతే తెలుగు రీమేక్ లో చాలా మార్పులు ఉండనున్నాయని సమాచారం.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.