
పవిత్ర పరీక్ష కోసం బళ్ళారికి వెళ్ళిన నరేష్: నెటిజన్లు ఏమంటున్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
పవిత్ర, నరేష్.. ఈ రెండు పేర్లు సోషల్ మీడియాలో తరచుగా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. రీసెంట్ గా వీరిద్దరూ నటించిన మళ్ళీ పెళ్ళి సినిమా, థియేటర్లలోకి వచ్చింది.
పవిత్ర, నరేష్ ల జీవితంలో జరిగిన సంఘటనలను సినిమాగా చూపించారని మళ్ళీ పెళ్ళి సినిమా చూసిన ప్రేక్షకులు ఇంటర్నెట్ లో కామెంట్స్ చేసారు.
అయితే ఈ సినిమాకు వసూళ్ళు తక్కువగా ఉన్నాయి. టీజర్, ట్రైలర్ కు రెస్పాన్స్ బాగానే వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం అంతగా లేవని సమాచారం.
అదలా ఉంచితే, ప్రస్తుతం పవిత్ర, నరేష్ లు మరోమారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. దానికి కారణం, పవిత్ర పరీక్ష రాయడమే.
Details
మాతృభాషలో పీజీ చేయాలని పవిత్ర కోరిక
పవిత్రా లోకేష్ కు కన్నడలో పీ హెచ్ డీ చేయాలని ఎప్పటి నుండో కోరికగా ఉందట. అందువల్ల, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి బళ్ళారికి ఆమె వెళ్ళిందట. తోడుగా నరేష్ కూడా వెళ్ళారట.
పవిత్ర ఎగ్జామ్ రాసే వరకు నరేష్ అక్కడే ఉన్నారట. ఈ విషయమై పవిత్రా, నరేష్ లపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వయసులో పవిత్రకు కన్నడలో పీ హెచ్ డీ చేయాలని అనిపించడం, మాతృభాషపై ఇష్టం ఉండడం మెచ్చుకోవాల్సిన విషయమని నెటిజన్లు అంటున్నారు.
పవిత్రకు తోడుగా వచ్చిన నరేష్ ని కూడా అభినందిస్తున్నారు.