హరిహర వీరమల్లు కోసం పాట పాడనున్న పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన కొత్త సినిమా కోసం పాట పాడబోతున్నాడు. హరిహర వీరమల్లు చిత్రంలోని ఒక పాటను పవన్ కళ్యాణ్ పాడబోతున్నాడని వినిపిస్తోంది. హరిహర వీరమల్లు చిత్ర సంగీత దర్శకుడైన కీరవాణి, పవన్ కళ్యాణ్ తో పాట పాడించాలని డిసైడ్ అయ్యారట. వేరే సింగర్స్ పాడటం కంటే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని కీరవాణి అనుకున్నారట. పవన్ పాడబోయే పాట అద్భుతంగా ఉండబోతుందని టాక్. ఇదివరకు ఖుషీ, అత్తారింటికి దారేది, అజ్ఞాత వాసి, జానీ చిత్రాల్ల.. బిట్ సాంగ్స్ పాడారు పవన్ . ఇప్పుడు ఏకంగా పూర్తి సాంగ్, పవన్ గొంతులో ఉండబోతుందని సమాచారం. ఈ విషయమై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ఔరంగ జేబుగా అర్జున్ రాంపాల్
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఓజీ షెడ్యూల్ పూర్తి కాగానే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటాడని అంటున్నారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు కోసం సమయాన్ని కేటాయిస్తాడని చెప్పుకుంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ కనిపిస్తోంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలం నాటి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో, బందిపోటు దొంగగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. ఔరంగ జేబు పాత్రలో బాలీవుడ్ యాక్టర్, అర్జున్ రాంపాల్ నటిస్తున్నారట. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ చిత్రం, ఈ సంవత్సరం చివర్లో లేదా 2024సంవత్సరం మొదట్లో విడుదల అవుతుంది.