OG Trailer: స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కల్యాణ్.. అదిరిపోయిన 'ఓజీ' ట్రైలర్
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన 'ఓజీ' ట్రైలర్ (OG Trailer) ఎట్టకేలకు విడుదలైంది. ఆదివారం ఉదయం రిలీజ్ చేస్తామని ముందే చెప్పిన చిత్ర బృందం.. తాజాగా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లో ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ 'ఓజాస్ గంభీర' (Ojas Gambhira)గా కనిపించనున్నారు.
Details
విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా ఆకట్టుకోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. పవర్‌స్టార్ కొత్త యాంగిల్‌లో కనువిందు చేయనున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఈ నెల 25న (OG Release Date) గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.