
పవన్ అభిమానులకు పండగ లాంటి వార్త: బ్రో సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నెమ్మదిగా మొదలయ్యాయి. మొన్నటికి మొన్న బ్రో నుండి జాణవులే అనే సెకండ్ సాంగ్ రిలీజ్ చేసారు.
ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ పై కీలక అప్డేట్ ని వదిలింది చిత్రబృందం.
ఒకానొక మీడియా సమావేశంలో మాట్లాడిన బ్రో సినిమా నిర్మాత వివేక్ కూచిబొట్ల, బ్రో ట్రైలర్ ని జులై 21న విడుదల చేస్తామని వెల్లడించారు. దీంతో పవన్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు.
బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జులై 24వ తేదీన ఈవెంట్ ఉండే అవకాశం ఉందని సమాచారం.
Details
వారాహి యాత్రలో బిజీగా పవన్ కళ్యాణ్
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, వారాహి యాత్రలో బిజీగా ఉన్నారు.
తేదీల సర్దుబాటు సరిగ్గా కుదిరితే జులై 24న ప్రీ రిలీజ్ ఉంటుందని, లేదంటే మరో తేదీన ఈవెంట్ ఉంటుందని సమాచారం.
బ్రో సినిమాలో దేవుడిగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. తమిళంలో తెరకెక్కిన వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా బ్రో రూపొందింది.
సముద్రఖని దర్శకత్వం వహించిన బ్రో సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలను త్రివిక్రమ్ అందించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో, కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా కనిపిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జులై 28వ తేదీన బ్రో సినిమా, థియేటర్లలో విడుదల అవుతుంది.