Page Loader
Harihara veeramallu : 'హరిహర వీరమల్లు' సినిమా నుండి మూడో సాంగ్ కి డేట్ లాక్?
'హరిహర వీరమల్లు' సినిమా నుండి మూడో సాంగ్ కి డేట్ లాక్?

Harihara veeramallu : 'హరిహర వీరమల్లు' సినిమా నుండి మూడో సాంగ్ కి డేట్ లాక్?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2025
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో అత్యధిక అభిమానులను సంపాదించుకున్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రథమ స్థానంలో నిలిచారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా,ఆయనపై ఉన్న క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ప్రస్తుతం రాజకీయాల్లో ఎంతగానో నిమగ్నమైనప్పటికీ,ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. అందులో 'హరిహర వీరమల్లు' ఒకటి. ప్రముఖ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. అయితే,ఏప్రిల్ 14లోపు పవన్ కళ్యాణ్ తన భాగాన్ని పూర్తిచేయాలని డేట్స్ కేటాయించినట్లు సమాచారం. ఆయన అందించిన సమయాన్ని ఉపయోగించుకుని,చిత్రబృందం కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు సిద్ధమవుతోంది. పవన్ కెరీర్‌లో తొలి పాన్-ఇండియా సినిమా ఇదే కావడం వల్ల దీని మీద భారీ స్థాయిలో హైప్ నెలకొంది.

వివరాలు 

ఏప్రిల్ 10న విడుదల

అయితే,అనేక కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ రావడం వల్ల కొంతమేర అంచనాలు తగ్గాయి. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీ మార్చి నుంచి మే నెలకు మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు నమ్మకం అందించాయి. తాజా సమాచారం ప్రకారం,ఈ చిత్రంలోని మూడో పాటను ఏప్రిల్ 10న విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు,నాలుగో పాటను ఏప్రిల్ 15న విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పాటల్లో ఒకటి ఒకటి మాస్ డ్యాన్స్ కూడిన సాంగ్, మరో మెలోడీగా సాగే సాంగ్ అని సమాచారం.అయితే,దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.