LOADING...
ఓజీ సెట్లోకి పవన్ కళ్యాణ్ ఆగమనం: యాక్షన్ సీన్లపై ఫోకస్ 
ఓజీ సెట్లోకి పవన్ కళ్యాణ్

ఓజీ సెట్లోకి పవన్ కళ్యాణ్ ఆగమనం: యాక్షన్ సీన్లపై ఫోకస్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 09, 2023
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ హీరోగా సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఓజీ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ లో జరుగుతున్న మూడవ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యారు. ఈమేరకు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మొదటి రెండు షెడూల్స్ ముంబై, పుణెలో పూర్తయ్యాయి. ప్రస్తుతం జరుగున్న షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ సంవత్సరం చివర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిత్రబృందం అధికారిక ట్వీట్