Hari Hara Veera Mallu Trailer: 'ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం'.. హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదల..
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్న పాన్-ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈచిత్రం జూలై 24, 2025న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. "హిందువుగా జీవించాలంటే పన్ను చెల్లించాల్సిన సమయం..ఈ దేశ శ్రమ ముస్లిం బాద్‌షా పాదాల క్రింద నలిగిపోతున్న కాలం.. ఒక వీరుడు కోసం పకృతి పురుడు పోసుకుంటున్న సమయం.." వంటి డైలాగులతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈవిజువల్స్ చూస్తే 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యంలో, ముఖ్యంగా ఔరంగజేబు పాలనలో జరిగే కథాంశాన్ని ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది.
వివరాలు
ధైర్యసాహసాలు గల యోధుడిగా పవన్
పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే ధైర్యసాహసాలు గల యోధుడిగా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్, నాజర్, నార్గిస్ ఫఖ్రీ, అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, సునీల్, విక్రమ్‌జీత్ విర్క్, నోరా ఫతేహి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు క్రిష్ జగర్లమూడి,జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎ. దయాకర్ రావు నిర్మిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీకి మనోజ్ పరమహంస, ప్రొడక్షన్ డిజైన్‌కు తోట తరణి బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రాన్ని ఎ.ఎం. రత్నం సమర్పిస్తున్నారు.