NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న తొలిప్రేమ 
    తదుపరి వార్తా కథనం
    పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న తొలిప్రేమ 
    జూన్ 30న మళ్ళీ విడుదలవుతున్న తొలిప్రేమ

    పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న తొలిప్రేమ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 24, 2023
    03:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. మహేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన ఈ ప్రారంభం, పవన్ కళ్యాణ్ ఖుషి, రామ్ చరణ్ ఆరెంజ్, ప్రభాస్ రెబెల్, ఎన్టీఆర్ సింహాద్రి చిత్రాలతో కొనసాగుతూనే ఉంది.

    తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన మరో బ్లాక్ బస్టర్ మూవీ, రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ ని కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసిన చిత్రం తొలిప్రేమ, మళ్ళీ విడుదలవుతోంది.

    ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. జూన్ 30వ తేదీన తొలిప్రేమ సినిమా థియేటర్లలో మళ్ళీ సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

    Details

    25ఏళ్ల తొలిప్రేమ 

    కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన తొలిప్రేమ సినిమాను ఏ కరుణాకరన్ డైరెక్ట్ చేసారు. కరుణాకరన్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇదే.

    పవన్ కళ్యాణ్ కెరీర్ లో మూడవ చిత్రంగా రిలీజైన తొలిప్రేమ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని, పవన్ కెరీర్ లో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది.

    ఈ సినిమాలో కొన్ని సీన్లు ఐకానిక్ గా నిలిచిపోయాయి. ముఖ్యంగా హీరోయిన్ ఎంట్రీ సీన్, క్లైమాక్స్ లో ఎయిర్ పోర్ట్ సీన్.. ఇవన్నీ తెలుగు సినిమాకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయాయి.

    తొలిప్రేమ రిలీజై ఇప్పటికి 25ఏళ్ళు పూర్తవుతుంది. ఈ కారణంగా మరోసారి ప్రేక్షకులను తొలిప్రేమ అనుభవాలను గుర్తు చేయడానికి మళ్ళీ విడుదల అవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    తెలుగు సినిమా

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    పవన్ కళ్యాణ్

    అన్ స్టాపబుల్: త్రివిక్రమ్ తో స్నేహం చేయాల్సొచ్చిందన్న పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్
    ఘనంగా ప్రారంభమైన పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం తెలుగు సినిమా
    టాప్ హీరో దగ్గర పిల్ల స్కూలు ఫీజులకు డబ్బుల్లేవా అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ సీనియర్ దర్శకుడు సినిమా
    రెండు భాగాలుగా రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ ఓజీ తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    శర్వానంద్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్: వేడుక ఎక్కడ జరుగుతుందంటే?  సినిమా
    డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక  రష్మిక మందన్న
    ఆదిపురుష్: జైశ్రీరామ్ పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చెప్పేసారు  ప్రభాస్
    ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్టు ఇదే  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025