Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
సంధ్య థియేటర్‌లోని తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన, 'తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప నాయకుడు అని, ఆయన కిందినుంచి ఎదిగారన్నారు.
అక్కడ వైసీపీ విధానాలు అనుసరించలేదన్నారు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు, టికెట్ ధరను పెంచే అవకాశం ఇచ్చారని తెలిపారు.
అల్లు అర్జున్ విషయంలో నిజం తెలియదని, చట్టం అందరికీ సమానమన్నారు. ఇందులో పోలీసుల తీరును తప్పుపట్టను అని చెప్పారు.
థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందుగా చెప్పి ఉండాల్సిందన్నారు. అతడు సీటులో కూర్చోడానికి ముందు చెప్పి తీసుకెళ్లాల్సిందనని, ఈ ఘటనలో హీరోని ఒంటరి చేశారన్నారు.
Details
గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు
చిరంజీవి కూడా అభిమానులతో సినిమాలు చూసేందుకు వెళ్లేవారన్నారు.
కానీ ఆయన ముసుగు వేసుకుని ఒక్కరిగా వెళ్లేవారని పవన్ అన్నారు. అల్లు అర్జున్ తరఫున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేదన్నారు.
గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారని, తన వల్లే ఒకరు చనిపోయారనే బాధ అర్జున్‌లో ఉందన్నారు. అల్లు అర్జున్‌ను ఒక్కడినే దోషిగా మలచడం సరైన నిర్ణయం కాదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.