Page Loader
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ ఇదే
ఢిల్లీలో మీడీయాతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ ఇదే

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 05, 2023
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ఈ సినిమా మీద ఆశలు పెట్టుకుంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలు కానుందని సమాచారం. ఇందులో పవన్ కళ్యాణ్ ఎలా కనిపించనున్నాడనేది అందరికీ హాట్ టాపిక్ గా మారింది. ఐతే ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ ఎలా కనిపించనున్నాడో తెలిసిపోయింది. తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కనిపించారు పవన్ కళ్యణ్. క్లీన్ షేవ్, నార్మల్ హెయిర్ కట్ తో పవన్ కళ్యాణ్ కనిపించారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఇదే లుక్ ఉండబోతుందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్

వినోదయ సీతమ్ రీమేక్ లోనూ ఇదే లుక్

ఉస్తాద్ షూటింగ్ కోసమే పవన్ కళ్యాణ్ అలా లుక్ మార్చారని అంటున్నారు. ఆ లుక్ లో పవన్ మరింత యంగ్ గా కనిపిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయ సీతమ్ తెలుగు రీమేక్ లోనూ ఇదే లుక్ ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ కూడా ఏకకాలంలో జరుగుతోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ నుండి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసినట్లే. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారనేది ఇంకా తెలియలేదు. ఇకపోతే వినోదయ సీతమ్ తెలుగు రీమేక్ లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీలో మీడీయాతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్