
ఓజీ: థాయ్ లాండ్ వెళ్ళనున్న పవన్ కళ్యాణ్?
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సాహో దర్శకుడు సుజిత్ రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి.
సంగీత దర్శకుడు థమన్, ఓజీ సినిమా మ్యూజిక్ వేరేగా ఉంటుందని చెప్పినప్పటి నుండి అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
అయితే, తాజాగా ఓజీ సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చింది. ఓజీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 30రోజులు కేటాయించారని అంటున్నారు.
ఈ 30రోజుల్లో కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ 30రోజుల పాటు థాయ్ లాండ్ లో షూటింగ్ జరగనుందని టాక్.
Details
అక్టోబర్ లో షెడ్యూల్ మొదలు
అక్టోబర్ లో మొదలవబోయే ఈ షెడ్యూల్ కోసం పవన్ కళ్యాణ్ ప్రిపేర్ అవుతున్నారని టాక్. 30రోజుల పాటు థాయ్ లాండ్ లోనే ఉండనున్నారట.
కీలక యాక్షన్ ఘట్టాలు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తారట. ప్రస్తుతానికి థాయ్ లాండ్ షెడ్యూల్ పై అధికారిక సమాచారం రాలేదు.
మరికొద్ది రోజుల్లో రానుందని అంటున్నారు.
డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఓజీ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంకా ఆరుల్ మోహన్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ నటిస్తున్నారు.