LOADING...
Ustaad Bhagat Singh :'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి 'ఆరా ఆఫ్ ఉస్తాద్'..పవన్ కళ్యాణ్ మాస్ రేంజ్‌కు తగ్గ పాట రెడీ!
పవన్ కళ్యాణ్ మాస్ రేంజ్‌కు తగ్గ పాట రెడీ!

Ustaad Bhagat Singh :'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి 'ఆరా ఆఫ్ ఉస్తాద్'..పవన్ కళ్యాణ్ మాస్ రేంజ్‌కు తగ్గ పాట రెడీ!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో 'గబ్బర్ సింగ్' సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు పదేళ్లకు పైగా గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి 'ఉస్తాద్ భగత్ సింగ్' (UBS) చిత్రంతో కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు గరిష్ఠ స్థాయికి చేరాయి. శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ.150 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన 'దేఖ్ లేంగే సాలా' గ్లింప్స్‌లో పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్‌తో కూడిన డైలాగ్ డెలివరీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వివరాలు 

పవన్ కళ్యాణ్ మార్క్ స్వాగ్

ఇదిలా ఉండగా, మార్చి 26న విడుదలకు సిద్ధమవుతున్న'ఉస్తాద్ భగత్ సింగ్'నుంచి రెండో పాటను విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. 'ఆరా ఆఫ్ ఉస్తాద్'అనే టైటిల్‌తో రానున్నఈ పాట పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా,మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఎలివేషన్లతో రూపొందించబడినట్టు దర్శకుడు హరీష్ శంకర్ సంకేతాలు ఇచ్చారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రచించిన సాహిత్యానికి,దేవిశ్రీ ప్రసాద్ (DSP)అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ పాట పవన్ కళ్యాణ్ మార్క్ స్వాగ్‌ను చూపిస్తూ,థియేటర్లలో అభిమానుల చేత విజిల్స్ వేయించేలాగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పటికే హరీష్ శంకర్,చంద్రబోస్ కలిసి దేవిశ్రీ ప్రసాద్‌ను భుజాలపై ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో,మ్యూజిక్ విషయంలో టీమ్ ఎంత ధీమాగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement