Loading...
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వ్రాసిన వారు Moogati Shabari
Aug 09, 2026
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, సంస్కృతిని కాపాడుతూ తరతరాలుగా అడవులను సంరక్షిస్తున్న గిరిజనుల సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రకృతి, సంస్కృతి, ప్రాచీన జ్ఞానాన్ని పరిరక్షించడంలో గిరిజన సమాజాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గిరిజన సమాజాలతో తనకు ఉన్న అనుబంధం వ్యక్తిగతమైనదని పవన్ కళ్యాణ్ తెలిపారు. వారి గౌరవం, సంక్షేమం కోసం పనిచేయాలనే తన సంకల్పాన్ని వారి నమ్మకం మరింత బలపరుస్తుందని అన్నారు. గిరిజన సంస్కృతి పరిరక్షణతో పాటు సాంప్రదాయ వైద్యం, అటవీ సంపద సంరక్షణలో గిరిజన మహిళలు పోషిస్తున్న పాత్రను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.

వివరాలు

ఆదివాసీల ఆశయాలు నెరవేరాలని ఆకాంక్ష..

గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వారి హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

'అడవి తల్లి బాట' వంటి కార్యక్రమాల ద్వారా మారుమూల గూడేలకు రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.

గిరిజనుల అస్తిత్వానికి ఎలాంటి భంగం కలగకుండా ఆధునిక అభివృద్ధికి బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు.

పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఆదివాసీల జీవన విధానం అందరికీ ఆదర్శమని పవన్ కళ్యాణ్ అన్నారు.

ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఆదివాసీల ఆశయాలు నెరవేరాలని, వారి జీవితాల్లో మరింత వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.

వివరాలు

సోషల్ మీడియా వేదికగా సందేశం..

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఈ సందేశాన్ని పంచుకున్నారు.

కాగా, కొద్ది రోజుల క్రితం ఆగస్టు 1న విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద జరిగిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఈ సభకు దాదాపు 13 వేల మంది ఆదివాసీ మహిళలు హాజరయ్యారు.

ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో పవన్ కళ్యాణ్ గిరిజనుల సంస్కృతిని కొనియాడుతూ ప్రసంగించారు.

ఇప్పుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మరోసారి గిరిజనుల సేవలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్.. వారి గౌరవం, సంక్షేమం కోసం అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ పోస్ట్..

ADVERTISEMENT