Dekh Lenge Saala : పవన్ స్టెప్పులతో సోషల్ మీడియా షేక్.. 'దేఖ్ లేంగే సాలా'తో చికిరి రికార్డు బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'గబ్బర్ సింగ్'లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబో నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి ఆకాశాన్ని తాకుతోంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు హరీష్ శంకర్ సినిమాను ఓ ప్రత్యేక రేంజ్‌లో డిజైన్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు మంచి స్పందన తెచ్చుకోగా, తాజాగా విడుదలైన "దేఖ్ లేంగే సాలా (Dekh Lenge Saala)" సాంగ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
Details
24 గంటల్లోనే ఏకంగా 29.6 మిలియన్లకు పైగా వ్యూస్
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట విడుదలైన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 29.6 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. 24 గంటల్లో ఈ స్థాయి వ్యూస్ అందుకున్న పాటగా "దేఖ్ లేంగే సాలా" కొత్త రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు ఈ రికార్డు రామ్ చరణ్ సినిమా 'పెద్ది'లోని "చికిరి" సాంగ్ పేరిట ఉండగా, ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి టాప్‌లో నిలిచింది ఈ పాట. ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్‌గా మారడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ డాన్స్ అని చెప్పాలి. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్టెప్పులతో అభిమానులను ఫిదా చేశాడు.
Details
హరీష్ శంకర్‌పై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం
ఈ క్రెడిట్ పూర్తిగా దర్శకుడు హరీష్ శంకర్‌కే దక్కుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారో ఖచ్చితంగా అర్థం చేసుకుని, పక్కా ప్లానింగ్‌తో ఈ పాటను తెరకెక్కించాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే హరీష్ శంకర్‌పై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఒక్క పాటతోనే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. సినిమా కూడా ఈ పాటలాగే భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 2026 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సాంగ్‌తోనే ఈ స్థాయి రికార్డులు సృష్టించిన పవన్ కళ్యాణ్, సినిమాతో ఇంకెంత పెద్ద రికార్డులు నెలకొల్పుతాడో చూడాల్సిందే.