
పెదకాపు 1 ట్విట్టర్ రివ్యూ: శ్రీకాంత్ అడ్డాల కొత్త ప్రయత్నం ప్రేక్షకులను మెప్పించిందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నారప్ప సినిమాతో మాస్ సినిమాలను తెరకెక్కించగలడని నిరూపించాడు.
కానీ అది రీమేక్ చిత్రం కావడం, థియేటర్లలో రిలీజ్ కాకపోవడం వల్ల శ్రీకాంత్ అడ్డాల పనితనం గురించి పెద్దగా బయటకు రాలేదు.
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన పెదకాపు 1 ఈరోజు థియేటర్లలో రిలీజైంది. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో, విరాట్ కర్ణ హీరోగా పరిచయమవుతున్నారు.
ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్ర ప్రీమియర్లు ఆల్రెడీ పడిపోయాయి. దీంతో టాక్ బయటకు వచ్చేసింది.
ఇంతకీ పెదకాపు 1 సినిమా గురించి నెటిజన్లు ఎలాంటి అభిప్రాయాలు పంచుకుంటున్నారో చూద్దాం.
Details
పెదకాపు 1 సినిమాకు మిశ్రమ స్పందన
సినిమా అక్కడక్కడా కొంచెం స్లోగా సాగిపోయిందని, ఓవరాల్ గా చూసుకుంటే ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయిందని అంటున్నారు.
ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
అనసూయకు మంచి పాత్ర దక్కిందని, శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసినట్టేనని చెప్తున్నారు.
హీరో విరాట్ కర్ణ బాగా చేశారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంకొందరేమో ఈ సినిమా పార్టులు పార్టులుగా మాత్రమే బాగుందని, ఓవరాల్ గా కొంత స్లోగా సాగిందని, శ్రీకాంత్ అడ్డాల మరింత ఎఫర్ట్స్ పెట్టాల్సిందని సలహా ఇస్తున్నారు.
మొత్తానికి పెదకాపు 1 సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పెదకాపు 1 సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు
#PeddhaKapu1 - Works In Bits!!
— cinee worldd (@Cinee_Worldd) September 29, 2023
Felt Like Political Agenda Film In Few Episodes...Story is Decent But #SrikanthAddala Execution Should Have Been Better!!
Detailed Review & Rating Shortly!! pic.twitter.com/ylN7EAji4W
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పెదకాపు 1 సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు
#PeddhaKapu1 akkadakkada pace tappa super hit cinema. Intro, interval and climax will give you goosebumps.
— Shiva Shankar Reddy (@sankar485) September 27, 2023
Maa @anusuyakhasba gariki career best character. Take a bow iraga tesaru Anasuya garu.
What a comeback by Srikanth Addala 👌👌👌
Mickey BGM and Chota Camera work🔥🔥🔥 pic.twitter.com/paiTwf7nmT
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పెదకాపు 1 సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు
One of the finest works from Director Srikanth Addala #PeddhaKapu1 👍
— Vamsi Kaka (@vamsikaka) September 28, 2023