LOADING...
Peddi: 'పెద్ది' ఫస్ట్ గ్లింప్స్ రివీల్‌.. మాస్ అవతారంలో రామ్ చరణ్ లుక్ అదుర్స్!

Peddi: 'పెద్ది' ఫస్ట్ గ్లింప్స్ రివీల్‌.. మాస్ అవతారంలో రామ్ చరణ్ లుక్ అదుర్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2026
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ లభించింది. ఆయన హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం పెద్ది నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఈ వీడియోలో చరణ్‌ను మునుపెన్నడూ చూడని రగ్గడ్‌, మాస్ లుక్‌లో చూపిస్తూ దర్శకుడు సినిమాపై ఆసక్తిని పెంచారు.

వివరాలు

పవర్‌ఫుల్ డైలాగ్ హైలైట్

గ్లింప్స్ ప్రారంభంలో వినిపించే కుస్తీ అంటే బ్యాట్‌తో బంతికి ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో చావుకి ఎదురెళ్లే ఆట" అనే డైలాగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది కేవలం క్రీడా నేపథ్య చిత్రం కాకుండా, ఒక యోధుడి జీవన్మరణ పోరాటాన్ని ప్రతిబింబిస్తుందని స్పష్టమవుతోంది. కుస్తీ, క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామాలో చరణ్ పాత్ర శక్తివంతంగా ఉండబోతుందని గ్లింప్స్ సూచిస్తోంది. విజువల్స్‌లో రామ్ చరణ్ మేకోవర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కండలు తిరిగిన శరీరం, ఒంటి నిండా మట్టి, చేతిలో గదతో కనిపించే ఆయన లుక్‌ చూస్తే, రంగస్థలంలోని చిట్టిబాబును మించిన మాస్ అవతార్‌గా కనిపిస్తున్నారు. ఆయన కళ్లలో కనిపించే పౌరుషం, గంభీర నడక ఈ గ్లింప్స్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి.

వివరాలు

రెహమాన్ సంగీతం మ్యాజిక్

ఈ గ్లింప్స్‌కు ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. 1980ల గ్రామీణ వాతావరణాన్ని, కుస్తీ బరిలోని ఉత్కంఠను తన సంగీతంతో ప్రేక్షకులకు బలంగా అనుభూతి పరచించారు. ట్రెండింగ్‌లో గ్లింప్స్ ప్రస్తుతం ఈ గ్లింప్స్ యూట్యూబ్‌, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. చరణ్ కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చిత్రబృందం తెలిపిన ప్రకారం 'పెద్ది' చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement