LOADING...
May 1 Releases : రామ్ చరణ్ మూవీ వాయిదా.. మేడే రోజు పోటీపడి రిలీజ్ అవుతున్న సినిమాలివే
రామ్ చరణ్ మూవీ వాయిదా.. మేడే రోజు పోటీపడి రిలీజ్ అవుతున్న సినిమాలివే

May 1 Releases : రామ్ చరణ్ మూవీ వాయిదా.. మేడే రోజు పోటీపడి రిలీజ్ అవుతున్న సినిమాలివే

వ్రాసిన వారు Moogati Shabari
Apr 19, 2026
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ సమ్మర్ సీజన్ కూడా ఆశించినంతగా కళకళలాడడం లేదు. ముందుగా ప్రకటించిన ప్యారడైజ్, లెనిన్ చిత్రాల తర్వాత పెద్ది సినిమా కూడా వరుసగా వాయిదా పడింది. ముఖ్యంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా భావించిన పెద్ది డిలే అవ్వడం అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది. అయితే ఈ మార్పులతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కొంత ఊరట లభించింది. పెద్ది రిలీజ్ లేకపోవడంతో మే 1 తేదీని కొన్ని సినిమాలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. చరణ్-బుచ్చి ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో తరుణ్ భాస్కర్ సినిమా విడుదలకు ఉపయోగపడింది. కానీ ఈ వాయిదా ప్రభావం టాలీవుడ్‌ కంటే ఇతర భాషా పరిశ్రమలకు ఎక్కువగా అనుకూలంగా మారే అవకాశం ఉంది.

వివరాలు

తెలుగు మార్కెట్‌‌పై ధనుష్ ఫోకస్.. 

ధనుష్ తన కొత్త సినిమా కరతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. గతంలో ఇడ్లీ కడాయ్‌ను విడుదల చేసినప్పటికీ, కాంతార చాప్టర్ 1 ప్రభావంతో ఆ సినిమా పెద్దగా గుర్తింపు పొందలేదు. అలాగే తేరే ఇష్క్ మేను అమర కావ్యం పేరుతో తీసుకొచ్చినా, తెలుగు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఇప్పుడు కర సినిమాతో ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే కేవలం విడుదల చేయడం మాత్రమే కాకుండా, సరైన ప్రమోషన్ కూడా అవసరం. ఈసారి ధనుష్ తెలుగు మార్కెట్‌పై దృష్టి పెట్టి ప్రచారం చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఇదే సమయంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి కేడీ ది డెవిల్ సినిమా కూడా సిద్ధమవుతోంది.

వివరాలు

అమీర్ ఖాన్ కుమారుడి మూవీ..

పెద్ది వాయిదా ప్రభావం దక్షిణాది సినిమాలకే కాకుండా హిందీ చిత్రాలకు కూడా అనుకూలంగా మారింది. బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న సాయి పల్లవి నటించిన ఏక్ దిన్ సినిమా కూడా ఈ పరిస్థితిని లాభంగా మార్చుకుంటోంది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి సాయి పల్లవి నటించిన ఈ ప్రేమకథను తెలుగులో ఒక రోజు అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ సినిమా, అమీర్ ఖాన్ సూచనలతో ఆలస్యం అయ్యింది.

Advertisement

వివరాలు

మేడే రోజు సినిమాల పండుగ..

ఇక మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంపై రూపొందించిన రాజా శివాజీ సినిమా కూడా అదే రోజున విడుదలకు సిద్ధమవుతోంది. రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా కలిసి నటించిన ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉంది. మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని అదే తేదీని ఎంచుకున్నారు. ఈ చిత్రంలో రితేష్ దర్శకుడిగా, జెనీలియా నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. ఇలా మేడే సందర్భంగా అనేక సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సమ్మర్‌లో నిజమైన విజేత ఏ సినిమా అవుతుందో, టాలీవుడ్ బాక్సాఫీస్‌పై ఏ చిత్రం ఆధిపత్యం చెలాయిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement