Peddi : పెద్ది కోసం మేకర్స్ కొత్త ప్లాన్.. త్వరలో సెకండ్ ట్రైలర్
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది'పై ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు విడుదలైన పాటలు సినిమాపై మంచి అంచనాలు పెంచగా, తాజాగా వచ్చిన ట్రైలర్ మాత్రం అభిమానుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రైలర్‌లో కొత్తదనం తక్కువగా ఉందని, పలు సినిమాల ఛాయలు కనిపించాయని ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది.
వివరాలు
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ..
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్లు సమాచారం. సినిమాపై మరింత హైప్ తీసుకురావడానికి రెండో ట్రైలర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ కొత్త ట్రైలర్‌లో ఇప్పటివరకు బయటపెట్టని అసలు కథను హైలైట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో కీలకంగా ఉండే భావోద్వేగాలు, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌కు సంబంధించిన ఇంటెన్స్ సన్నివేశాలను ప్రేక్షకులకు చూపించనున్నారట.
వివరాలు
ట్రైలర్లో గూస్‌బంప్స్ ఎలివేషన్స్..
అలాగే కథలోని ప్రధాన సంఘర్షణను కూడా ఈ ట్రైలర్ ద్వారా స్పష్టంగా చూపించే అవకాశం ఉందని అంటున్నారు. రామ్ చరణ్ చేసిన అద్భుతమైన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, థియేటర్లలో అభిమానులతో విజిల్స్ వేయించే యాక్షన్ సీన్స్, అలాగే గూస్‌బంప్స్ కలిగించే ఎలివేషన్ మూమెంట్స్ ఈ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. ఈ రెండో ట్రైలర్ మెగా అభిమానులకు పూర్తి స్థాయి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ కొత్త ప్రమోషనల్ స్ట్రాటజీతో 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!