Ram Charan: 'దంగల్', 'సుల్తాన్' చూపిన దారిలోనే 'పెద్ది' ప్రయాణం.. రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మరో విభిన్నమైన స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ముంబైలో సోమవారం (మే 18) నిర్వహించిన 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. "సుల్తాన్, దంగల్ వంటి సినిమాలతో మాకు సరికొత్త దారి చూపించిన సల్మాన్ ఖాన్ సర్, అమీర్ ఖాన్ సర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆ చిత్రాలు మా లాంటి మేకర్స్‌లో అపారమైన నమ్మకాన్ని నింపాయి.
వివరాలు
నన
భారతీయ సినిమా చరిత్రలో ఇలాంటి క్రీడా నేపథ్య కథలు అద్భుతంగా పనిచేశాయి. అదే ప్రేరణతో, అదే నమ్మకంతో మేము కూడా ఈ ప్రయాణాన్ని ప్రారంభించామని అన్నారు. 'పెద్ది' సినిమా కోసం 'దంగల్', 'సుల్తాన్' చిత్రాలే బ్లూప్రింట్‌లా నిలిచాయని రామ్ చరణ్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన ఈ రెండు చిత్రాలు స్పోర్ట్స్ జానర్‌కు కొత్త గుర్తింపును తీసుకువచ్చాయి. ముఖ్యంగా అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'దంగల్' దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా సంచలన విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ.2000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
వివరాలు
'ఉప్పెన' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు
ఫోగట్ సిస్టర్స్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. మరోవైపు సల్మాన్ ఖాన్ నటించిన 'సుల్తాన్' కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.623 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ రెండు సినిమాలు ఇచ్చిన ప్రేరణతోనే 'పెద్ది' రూపుదిద్దుకుందని రామ్ చరణ్ వెల్లడించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న బుబ్చిబాబు సానా, 'ఉప్పెన' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. దర్శకుడు ఈ ప్రాజెక్ట్ కోసం చూపించిన అంకితభావాన్ని రామ్ చరణ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. తన పాత్ర గురించి మాట్లాడిన రామ్ చరణ్.. "ఇది ఒక సాధారణ వ్యక్తి తన గుర్తింపుకోసం చేసే పోరాటం. సమాజంలో బ్రతకడానికి ప్రతి ఒక్కరికీ ఒక అస్తిత్వం అవసరం.
వివరాలు
జూన్ 4న రిలీజ్
ఈ సినిమాలో హీరో ఒక పెద్ద లక్ష్యం కోసం తన ఐడెంటిటీ క్రైసిస్‌ను ఎలా దాటాడన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు. అలాగే సినిమాలో హీరో ప్రయాణం ఒక క్రాస్‌ఓవర్ అథ్లెట్‌గా చాలా సహజంగా సాగుతూనే, పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే బొమన్ ఇరానీ, దివ్యందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.