Peddi: పెద్ది మూవీ సాంగ్ గ్లోబల్ హిట్.. 'చికిరి'కి విదేశీ భామల హుక్ స్టెప్స్ వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
'చికిరి.. చికిరి..' — ఇప్పుడు కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్న పాట ఇదే! రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' మూవీ నుంచి ఇటీవల విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యి ట్రెండ్ లిస్టుల్లో టాప్ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా విదేశీ యువతులు, ఫారెన్ డ్యాన్సర్లు ఈ పాటకు స్టెప్స్ వేస్తున్న వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
Details
రామ్ చరణ్ ఎనర్జీకి ఫ్యాన్స్ ఫిదా
'పెద్ది' మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లిరికల్ సాంగ్ 'చికిరి' 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించి, ఇండియన్ మూవీల్లో రికార్డు సృష్టించింది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, మోహిత్ చౌహాన్ పాడిన ఈ పాట మెలోడీ, బీట్‌లు పక్కా పాన్-ఇండియా లెవెల్‌లో ఆకట్టుకుంటున్నాయి. రామ్ చరణ్ వేసిన ఎనర్జెటిక్ స్టెప్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి.
Details
ఫారెన్ గర్ల్స్ హుక్ స్టెప్స్‌తో వైరల్
'చికిరి' ఫీవర్ ఇండియాకే పరిమితం కాలేదు. విదేశీ భామలు కూడా రామ్ చరణ్ లా హుక్ స్టెప్స్ వేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఐదుగురు విదేశీ అమ్మాయిలు కలిసి వేసిన డ్యాన్స్ వీడియోను 'పెద్ది' మూవీ అధికారిక ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేయగా, నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. 'చికిరి వైబ్ అన్‌స్టాపబుల్. రూరల్ బీట్స్, పాన్ వరల్డ్ వైబ్!' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. నేపాలీ భామ స్టెప్స్‌కి నెట్ ఫిదా ఈ పాటకు నేపాలీ అమ్మాయి వేసిన డ్యాన్స్ వీడియో ప్రత్యేక ఆకర్షణగా మారింది. నోట్లో బీడీతో అచ్చం రామ్ చరణ్ స్టైల్లో వేసిన స్టెప్స్ ఫ్యాన్స్‌కి మైండ్ బ్లోయింగ్‌గా అనిపించాయి.ఈవీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది
Details
గ్లోబల్ రియాక్షన్స్
'చికిరి' పాటకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫారెనర్లు ఈ పాటను చూసి 'ఎనర్జీ లెవల్ అద్భుతం! స్టెప్స్ కిల్లింగ్!' అంటూ కామెంట్లు పెడుతున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.