AR Rahman: అవార్డుల గురించి రెహమాన్ షాకింగ్ కామెంట్స్..అలా అన్నాడేంటి భయ్యా
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'పై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. జూన్ 4న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ తరుణంలో మేకర్స్ ప్రమోషన్స్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూలో పాల్గొంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలో పెద్ది సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలో జరిగిన సీన్‌ను పంచుకున్నారు.
వివరాలు
ఐదున్నర గంటలకే నిద్రలేచి సాధన..
దుబాయ్‌లో తెల్లవారుజామున ఐదున్నర గంటలకే రెహమాన్ లేచి ఒంటరిగా సంగీత సాధన చేసేవారట. ఆయన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని బుచ్చిబాబు తెలిపారు. రామ్ చరణ్ క్యారెక్టర్ ట్రాన్స్‌ఫార్మేషన్, రెహమాన్ అంకితభావం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ఆయన వివరించారు. ఈ వయసులో కూడా అంతటి క్రమశిక్షణతో పని చేయడం కేవలం రెహమాన్‌కే సాధ్యమని దర్శకుడు చెప్పడం విశేషం.
వివరాలు
రెహమాన్ ఏమన్నాడంటే..
బుచ్చిబాబు ప్రశంసలపై రెహమాన్ స్పందించారు. సినీ పరిశ్రమ ప్రవహించే నీరు లాంటిదని, ఇక్కడ ఎప్పుడూ కొత్త టాలెంట్ వస్తూనే ఉంటుందని రెహమాన్ అన్నారు. అవార్డులకు మురిసిపోకుండా పనిచేయాలన్నారు. డిజిటల్ యుగంలో ప్రేక్షకులు యూట్యూబ్‌లో ప్రతి సెకన్ సౌండ్‌ను గమనిస్తూనే ఉన్నారన్నారు. పాటలో వచ్చే చిన్న హమ్మింగ్ బిట్‌ను సైతం కట్ చేసి వింటున్నారని, ఆడియన్స్ ఆలోచనా విధానం మారిపోయిందని గుర్తు చేశారు. అందుకే తాను నిరంతరం అప్‌డేట్ అవుతూ బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని రెహమాన్ స్పష్టం చేశారు.