LOADING...
Peddi : మెగా పవర్ స్టార్ మూవీ 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్..లీక్ చేసిన డైరెక్టర్
మెగా పవర్ స్టార్ మూవీ 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్..లీక్ చేసిన డైరెక్టర్

Peddi : మెగా పవర్ స్టార్ మూవీ 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్..లీక్ చేసిన డైరెక్టర్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 27, 2026
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'పెద్ది' విడుదల తేదీ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను దర్శకుడు బుచ్చిబాబు సనా అధికారికంగా వెల్లడించారు. జూన్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన తమిళ నటుడు ధనుష్ నటించిన 'కర' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన బుచ్చిబాబును యాంకర్ సుమ ప్రశ్నించగా, ఆయన 'పెద్ది' విడుదల తేదీని వెల్లడించారు. దీంతో సినిమా రిలీజ్‌పై నెలకొన్న సందేహాలకు ముగింపు లభించింది. గ్రామీణ క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో కొనసాగుతోంది.

వివరాలు

స్పోర్ట్స్ డ్రామా మూవీపై భారీ అంచనాలు..

ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రత్యేక ఐటెం సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని, అది పూర్తయ్యాక మొత్తం షూటింగ్ ముగుస్తుందని ఆయన చెప్పారు. ఈ పాటలో రామ్ చరణ్‌తో పాటు శృతి హాసన్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సాంగ్ సినిమా ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తుందని చిత్రబృందం భావిస్తోంది. మరోవైపు, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

వివరాలు

రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషీ..

మొదట ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయాలని భావించారు. అనంతరం కొన్ని కారణాల వల్ల దానిని ఏప్రిల్ 30కు మార్చారు. తర్వాత మరోసారి విడుదల తేదీ మారడంతో జూన్‌లో తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా జూన్ 25న విడుదల ఖరారు కావడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పలుమార్లు వాయిదా పడిన 'పెద్ది' ఇప్పుడు తుది రిలీజ్ డేట్‌తో ముందుకు వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ సందడి సృష్టిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Advertisement