Peddi: 'పెద్ది' టీజర్ రెడీ.. వచ్చే వారం అసలైన సందడి మొదలు!
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రగ్గడ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికీ పూర్తిగా ముగియలేదు. తాజాగా సమాచారం ప్రకారం.. 'పెద్ది' షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ పాల్గొనాల్సిన టాకీ భాగం దాదాపుగా పూర్తయ్యిందని సమాచారం. తన పాత్రకు సంబంధించిన డైలాగులు, కీలక సన్నివేశాల చిత్రీకరణను ఆయన ఎక్కువ భాగం ముగించేశారని తెలుస్తోంది.
వివరాలు
వేగంగా షూటింగ్
ఇక రామ్ చరణ్ అవసరం లేని కొన్ని చిన్న ప్యాచ్‌వర్క్ సన్నివేశాలను ప్రస్తుతం సెకండ్ యూనిట్ చిత్రీకరిస్తోంది. ఇంకా మిగిలి ఉన్న ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను చివరి షెడ్యూల్‌లో తెరకెక్కించనున్నారు. దీనితో పాటు ప్రత్యేకంగా ఒక స్పెషల్ సాంగ్‌ను కూడా చిత్రీకరించాల్సి ఉంది. ఈ రెండు పనులు పూర్తయిన తర్వాత సినిమా షూటింగ్ మొత్తం ముగిసినట్టే అని సినీ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
టీజర్ రిలీజ్‌కు ఏర్పాట్లు
ఈ నేపథ్యంలో 'పెద్ది' టీజర్ విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీజర్‌కు సంబంధించిన పనులు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయని సమాచారం. సినిమాపై ఆసక్తిని మరింత పెంచేలా ఒక పవర్‌ఫుల్ టీజర్‌ను రూపొందించేందుకు దర్శకుడు బుచ్చిబాబు సిద్ధమవుతున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు ఉండటంతో, అదే రోజున 'పెద్ది' టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఈ సమ్మర్‌కు కానుకగా రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.