LOADING...
<span style="font-size: 26px;" data-mce-style="font-size: 26px;">Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ రేట్లు పెంపు.. రోజుకు 5 షోలకు గ్రీన్ సిగ్నల్</span>
'పెద్ది' సినిమా టికెట్ రేట్లు పెంపు.. రోజుకు 5 షోలకు గ్రీన్ సిగ్నల్

Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ రేట్లు పెంపు.. రోజుకు 5 షోలకు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Moogati Shabari
Jun 03, 2026
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ 'పెద్ది' విడుదలకు ముందు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం ప్రకటించింది. సినిమా విడుదలకు ముందు టికెట్ రేట్లను పెంచుతూ ప్రకటన చేసింది. అలాగే ధరల పెంపుతో పాటు రోజుకు అదనపు షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తొలి రోజే సినిమాను చూసేందుకు చాలా మంది వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం జూన్ 3న రాత్రి 8 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షో వేసేందుకు అనుమతి ఇవ్వండతో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

వివరాలు

ఒక్కో టికెట్‌పై ఎంత పెరగొచ్చంటే?

స్పెషల్ ప్రీమియర్ షో కోసం టికెట్ ధరను గరిష్ఠంగా రూ.600గా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విడుదలకు ముందే అభిమానులు సినిమాను చూసేందుకు పోటీపడుతున్నారు. జూన్ 4న సినిమా విడుదలైన తర్వాత 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేసుకునే అవకాశం కల్పించింది.

వివరాలు

భారీ వసూళ్లు సాధించే అవకాశం..

అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.125 వరకు అదనంగా వసూలు చేసే అవకాశం ఉంది. సాధారణంగా 4 షోలు ప్రదర్శించే థియేటర్లకు ఈసారి ప్రత్యేక మినహాయింపు కూడా ఉండటంతో 'పెద్ది' సినిమా కోసం రోజుకు ఐదు షోలు వేయనున్నారు. దీంతో తొలి పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో షోలు వేయనున్నారు. మొత్తానికి పెద్ది మూవీ భారీ వసూళ్లను కొళ్లగొట్టనున్నట్లు తెలుస్తోంది.

Advertisement