Toxic movie Tickets: ఏపీ, తెలంగాణలో 'టాక్సిక్' టికెట్ ధరల పెంపునకు అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
యశ్ (Yash) కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్' (Toxic Movie). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'టాక్సిక్' టికెట్ ధరలను పెంచుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చిత్ర బృందానికి అనుమతి ఇచ్చాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఏపీలో ఆగస్టు 26న ఉదయం 6 గంటలకు ప్రదర్శించే స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు.
వివరాలు
రోజుకు ఐషోలు ప్రదర్శించేందుకు అనుమతి
పెంచిన టికెట్ ధరలు పది రోజుల పాటు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రోజుకు ఐదు షోలను ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
మరోవైపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీకి రూ.కోటి డిపాజిట్ చేయాల్సిందిగా 'టాక్సిక్' చిత్ర నిర్మాణ సంస్థ కేవీయన్ ప్రొడక్షన్స్‌కు ప్రభుత్వం సూచించింది.
ఈ సినిమాలో నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 'టాక్సిక్' విడుదల కానుంది. ఈ చిత్రం 3 గంటల 14 నిమిషాల (Toxic Runtime) నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.