#PKSDT మూవీలో నటించే వాళ్ళ లిస్ట్ వచ్చేసింది
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా వారం రోజుల క్రితమే ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా, తమిళ చిత్రమైన వినోదయ సీతమ్ కి రీమేక్ గా రూపొందుతోంది. దర్శక రచయిత సముద్రఖని, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇద్దరు మెగా హీరోలు ఒకే తెరపై కనిపిస్తుండడంతో ఈ సినిమాపై జనాల్లో మంచి అంచనాలున్నాయి. కామెడీ ప్రధానంగా రూపొందే ఈ సినిమాను చకచకా చిత్రీకరించి చాలా తొందరగా విడుదల చేయాలని అనుకుంటున్నారట. అందుకు తగినట్లుగా పనులను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారో ప్రకటించారు. అందులో ప్రధానంగా హాస్యనటుడు బ్రహ్మానందం ఉన్నారని అంటున్నారు.
Event హీరోయిన్లుగా ఇద్దరు భామలు
ఈ మధ్య బ్రహ్మానందం చాలా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇది వినోదం ప్రధానంగా సాగే సినిమా కాబట్టి ఇందులో బ్రహ్మానంద పాత్ర, కీలకంగా ఉండనుందని చెబుతున్నారు. తనికెళ్ళ భరణి, రోహిణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లను తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ లోంచి కొన్ని చిత్రాలు కూడా బయటకు వచ్చాయి. దర్శక రచయిత సముద్రఖని మెగాఫోన్ పట్టుకుని మానిటర్ లో చూస్తూ కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు. ఈ సంవత్సరం తమ అభిమాన హీరో నుండి వరుసప్ పెట్టి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నారు.