ప్రియదర్శిని అలా పోల్చవద్దని ఫైర్ అయిన రాహుల్ రామకృష్ణ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి దూకుడు మీద ఉన్న నటులు. అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే ఇటు హీరోగానూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
వీరిద్దరూ దాదాపుగా ఒకే టైమ్ లో ఇండస్ట్రీలోకి వచ్చారు కాబట్టి ఇద్దరి మధ్య పోలికలు వస్తున్నాయి. తాజాగా బలగం సినిమాతో ప్రియదర్శికి మంచి హిట్ దొరికింది.
ఇంటింటి రామాయణం సినిమాతో రాహుల్ రామకృష్ణ కూడా ఫర్వాలేదనిపించుకున్నాడు.
ఇప్పుడు ఈ రెండు సినిమాల గురించి మాట్లాడుతూ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలను పోలుస్తున్నారు. అదే ఇప్పుడు రాహుల్ రామకృష్ణకు ఇబ్బందిగా మారింది.
Details
రాహుల్ పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
ప్రియదర్శి మంచి నటుడని, పనిపట్ల అంకిత భావం ఉన్న కళాకారుడని, అతన్ని తనతో పోల్చడం ప్రియదర్శికి అవమానకరమనీ, అతను జీవితంలో ఇంకా ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తాడని, ఈ పోలిక అనేది ఒక మూర్ఖత్వమనీ రాహుల్ రామకృష్ణ ఫైర్ అయ్యారు.
రాహుల్ రామకృష్ణ ట్వీట్ కి నెటిజన్స్ స్పందిస్తూ, నువ్వు బాగా యాక్టింగ్ చేస్తావ్ బ్రో అని, ప్రియదర్శి, రాహుల్.. ఇద్దరూ ఇరగదీస్తారనీ, నేటివిటీని, యాసను ఎక్కడా మిస్ కానివ్వరని అంటున్నారు.
రాహుల్ రామకృష్ణ హీరోగా వచ్చిన ఇంటింటి రామాయణం, ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో నవ్య స్వామి హీరోయిన్ గా కనిపించింది. నరేష్, అంజిమామ, గంగవ్వ ప్రధాన పాత్రల్లో నటించారు.