బలగం సినిమా ఖాతాలో మరో మైలురాయి: ఏకంగా 100కు పైగా అవార్డులు
ఈ వార్తాకథనం ఏంటి
జబర్దస్త్ కమెడియన్ వేణు, దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం చిత్రం ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలిసిందే.
తెలంగాణ సంస్కృతి, పల్లె జీవితాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రం, తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయింది. ఈ సంవత్సరం రిలీజైన అన్ని సినిమాల్లో అతిపెద్ద విజయాన్ని బలగం అందుకుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
తెలుగు ప్రజలను ఎంతగానో మెప్పించిన ఈ సినిమా, ప్రపంచ వేదికల మీద సైతం తన సత్తా చాటింది. ఇప్పటివరకు ఈ చిత్రానికి వందకు పైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.
ఈ విషయాన్ని బలగం నిర్మాణ సంస్థ, దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. బలగం సినిమాలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
Twitter Post
A journey of Excellence and Recognition!❤️
— Dil Raju Productions (@DilRajuProdctns) July 4, 2023
Earlier, we had
Films running for 100 days..
Films running in 100 centers..
Films collecting 100 crores ..
Now, we have achieved a film with 100+ international awards❤️#Balagam is a special film for many reasons 🤗#BalagamGoesGlobal pic.twitter.com/Bq5O0gv5xw