LOADING...
Darshan: 'ప్లీజ్, కొంత విషం ఇవ్వండి'.. కోర్టులో ప్రాధేయపడ్డ నటుడు దర్శన్!
'ప్లీజ్, కొంత విషం ఇవ్వండి'.. కోర్టులో ప్రాధేయపడ్డ నటుడు దర్శన్!

Darshan: 'ప్లీజ్, కొంత విషం ఇవ్వండి'.. కోర్టులో ప్రాధేయపడ్డ నటుడు దర్శన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2025
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

కన్నడ స్టార్ హీరో దర్శన్ రేణుకా స్వామి హత్య కేసులో జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో ఖైదు కాబోతున్నాడు. ఈ కేసు కోర్టు విచారణలో కొనసాగుతోంది. తాజాగా దర్శన్ తనను బెంగళూరులోని సెంట్రల్ జైలుకు మార్చాలని కోర్టులో పిటిషన్ సమర్పించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిటీ సివిల్, సెషన్స్ కోర్ట్‌లో విచారణకు హాజరైన దర్శన్, అగ్రహారం జైల్లో సరైన సదుపాయాలు లేవని, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని తెలిపారు. అగ్రహరం జైలులో ఉండటం కన్నా చావడం సులభం. దయచేసి కొంత విషం ఇవ్వాలని కోర్టును కోరుతున్నానని ఆయన అభ్యర్థించారు. అయితే, కోర్టు తన అభ్యర్థనను తిరస్కరించింది. వీడియో కాన్ఫరెన్స్‌లో దర్శన్ భావోద్వేగానికి గురయ్యారు.

Details

నెల రోజులగా సూర్యరశ్మిని చూడలేదు

జడ్జికి అభ్యర్థిస్తూ నెల రోజులుగా సూర్యరశ్మి చూడలేదుగా, నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇక్కడ పరిస్థితులు భరించలేనంత దారుణంగా ఉన్నాయి. దుస్తులు, పరిసరాల నుండి అసహన వాసనలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవించడం అసంభవం. దయచేసి కొంత విషం ఇవ్వండి అని పేర్కొన్నారు. జడ్జి దర్శన్ మాటలు విన్న తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడకూడదని హెచ్చరించారు. దాంతో దర్శన్ మౌనంగా మారారు. కోర్టు అతన్ని బెంగళూరు జైలుకు మార్చలేమని స్పష్టం చేసింది. అయినప్పటికీ, అతడికి కొంత ఊరట ఇచ్చేందుకు, జైల్లో తిరగడానికి అనుమతి, అదనపు పరుపులు, దిండ్లు, బెడ్ షీట్లు ఇవ్వాలని ఆదేశించింది.

Details

గతేడాది జూన్ 11న దర్శన్ అరెస్టు

అలాగే, జైలు నియమాలను ఉల్లంఘించకపోవడంవల్ల, అతన్ని సెంట్రల్ జైలులోనే ఉంచవచ్చని పేర్కొంది. రేణుకా స్వామి హత్య కేసులో, గతేడాది జూన్ 11న దర్శన్‌ను అరెస్టు చేశారు. అతనితో పాటు పవిత్ర గౌడ మరియు మరో 15 మందిని కూడా జైలుకు పంపారు. 131 రోజుల తర్వాత, అక్టోబర్ 30న మధ్యంతర బెయిల్‌పై విడుదల చేశారు. డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్, పవిత్ర గౌడలకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేసింది. ఆగస్టు 14న సుప్రీంకోర్టు హైకోర్ట్ మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసి, దర్శన్ మళ్లీ జైలుకు వెళ్ళాల్సి వచ్చింది.