
Polishetty Rambabu: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
Producer Polishetty Rambabu: టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత పొలిశెట్టి రాంబాబు (58) కన్నుమూశారు.
కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఆయన.. హైదారాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో శనివారం పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచారు.
2006లో వచ్చిన 'గోడమీద పిల్లి' మూవీకి రాంబాబు నిర్మాతగా వ్యవహరించారు.
ఈ సినిమాకు జనార్ధన మహర్షి దర్శకుడిగా పని చేశారు. ఈ సినిమాలో అల్లరి నరేష్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు.
2008లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన లక్ష్మీ పుత్రుడు చిత్రానికి కూడా రాంబాబు నిర్మాతగా వ్యవహరించారు.
పొలిశెట్టి రాంబాబు ఇండస్ట్రీలోకి రాక ముందు సీపీఎం అనుబంధ సంఘం 'ప్రజానాట్య మండలి'లో పనిచేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అనారోగ్యంతో రాంబాబు కన్నుమూత
https://t.co/C8GMIbc95c#HealthIssue#PolishettyRambabu#Producer#teluguindustry
— Hittv Telugu (@HittvTelugu) March 9, 2024