Page Loader
Pooja Hegde Coolie: రజనీకాంత్ కూలీ నుంచి బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఫ‌స్ట్ లుక్ రిలీజ్
రజనీకాంత్ కూలీ నుంచి బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Pooja Hegde Coolie: రజనీకాంత్ కూలీ నుంచి బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఫ‌స్ట్ లుక్ రిలీజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2025
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాబోయే సినిమాలతో ప్రస్తుతం పూర్తిగా బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే 'జైలర్ 2'ను ప్రకటించిన తలైవా, మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ కలిసి పనిచేయడం వలన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

వివరాలు 

'జన నాయకన్'లో పూజా హెగ్డే

ఇదిలా ఉండగా, తాజాగా ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా నటించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అంతేకాకుండా, ఈ చిత్రంలో పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. మరోవైపు, పూజా హెగ్డే ప్రస్తుతం దళపతి విజయ్‌తో కలిసి 'జన నాయకన్' అనే చిత్రంలో నటిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్