LOADING...
Esther Noronha : రెండో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి
రెండో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి

Esther Noronha : రెండో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2025
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటి వరకు ఒకే పెళ్లి జీవితాంతం ఉండాలి అన్న సంప్రదాయం మారిపోతోంది. ఇప్పుడు విడాకులు తీసుకున్నవారు, జీవిత భాగస్వామి లేకపోయినా, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు రెండో పెళ్లి చేసుకోవడం సాధారణంగా మారింది. ఈ ధోరణి సామాన్యులలో మాత్రమే కాక, సినీ ప్రపంచంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. సింగర్ సునీత నుంచి అక్కినేని నాగచైతన్య వరకూ చాలామంది సౌఖ్యంగా రెండో పెళ్లులు చేసుకున్నారు. అలాంటివారిలో తాజాగా జాబితాలో చేరబోతున్నారంటూ వార్తల్లో నిలిచింది హీరోయిన్ ఎస్తేర్ నొరోన్హా. కర్ణాటకలోని ఉడిపి కి చెందిన ఎస్తేర్, ముంబైలో చదువుకొని పెరిగారు. బాలనటిగా కొంకణి చిత్రాల్లో నటించిన తర్వాత, 2012లో హిందీ సినిమా బారొమాస్ ద్వారా హీరోయిన్‌గా అడుగుపెట్టారు.

Details

ఏడాదికే విడిపోయిన నటి

తెలుగు సినీ రంగంలో ఆమె వేయి అబద్ధాలు సినిమాతో పరిచయమయ్యారు, ఇందులో పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించారు. అనంతరం భీమవరం బుల్లోడు, గరం, జయ జానకి నాయక, ఐరావతం, 69 సంస్కార్ కాలనీ, చెంగురే బంగారు రాజా, డెవిల్, టెనెంట్, థలా వంటి సినిమాల్లో నటిస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమాల్లోనే కాకుండా ఆమె తరచూ వార్తల్లో నిలిచింది. ఆమె గతంలో సింగర్ నోయెల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఏడాది మాత్రమే గడిచిన తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. కాగా, తాజాగా ఎస్తేర్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ వినిపించాయి.

Details

త్వరలోనే స్పెషల్ అనౌన్స్ మెంట్ చేస్తా

ఆ వార్తలను నిజం చేస్తూ, ఆమె సోషల్ మీడియా ద్వారా బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేలా ఫోటోలు షేర్ చేశారు. క్రైస్తవ వివాహంలో ధరించే తెల్లటి గౌను వేసుకుని, పడవలో కూర్చున్న ఫోటోలు అందించారు. ఫోటోలకి క్యాప్షన్‌గా ఇలా రాసుకున్నారు. జీవితంలో మరో అందమైన సంవత్సరం.. అవకాశాలు, అద్భుతాలను ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. పుట్టినరోజు సందర్భంగా మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. త్వరలోనే మీతో ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్ పంచుకుంటాను. వేచి ఉండండి అమె పేర్కొంది. ఈ పోస్ట్ తరువాత, ఎస్తేర్ నిజంగా రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.