తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Vaddepalli Srinivas: జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత
                వ్రాసిన వారు
                Sirish Praharaju
            
            
                            
                                    Feb 29, 2024 
                    
                     03:29 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సినీ,జానపద నేపధ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన .. సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని అయన నివాసంలో మృతి చెందారు. దాదాపు 100కు పైగా సాంగ్స్,పాడారు. 2012లో గబ్బర్ సింగ్ సినిమాలో 'గన్నులాంటి పిల్ల'.. అనే పాటతో శ్రీనివాస్ పాపులర్ అయ్యారు. ఈ పాటతో ఆయనకు ఫిలిఫేర్ అవార్డు కూడా వచ్చింది.ఆయన మృతికి సినీ, జానపద కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.