
Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల కాలంలో సినీ, సంగీత రంగాల్లో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ అస్సామీ గాయని గాయత్రి హజారికా (వయస్సు 44) అనారోగ్యంతో కన్నుమూశారు.
ఈ వార్త సంగీత ప్రియుల హృదయాలను బాధకు గురిచేసింది.
గతేడాది నుండి కొలన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె, శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
ఆమె మృతి పట్ల అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర సంతాపం ప్రకటించారు. ''గాయత్రి హజారికా మరణం అస్సామీ సంగీతానికి తీరని లోటు.
Details
నివాళులర్పిస్తున్న ప్రముఖులు
ఆమె సంగీత ప్రయాణం స్ఫూర్తిదాయకం,'' అంటూ ఆమెకు నివాళులర్పించారు.
ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు, సాంస్కృతిక రంగానికి చెందినవారు, అభిమానులు సంతాపం ప్రకటిస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
గాయత్రి హజారికా 'సరా పాటే పాటే నామే', 'జోనాక్ నాశిల్ బనత్', 'ఆబేలిర్ హెంగులీ ఆకాశే' వంటి పాటల ద్వారా అస్సామీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
ఆమె స్వరపరిచిన 'యేతియా జోనాక్ నామిశిల్', 'మాతో ఏజాక్ బరషున్', 'తోమాలై మోర్ మరమ్' వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.