Posani Krishna Murali: హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని.. ఓబులవారిపల్లె పీఎస్‌కు పోసాని కృష్ణమురళి తరలింపు
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్‌లోని రాయదుర్గం మైహోమ్ భూజాలో అదుపులోకి తీసుకున్న అనంతరం నేరుగా అక్కడికి తీసుకువచ్చారు.
స్టేషన్‌లో ప్రభుత్వ వైద్యుడు గురుమహేశ్ ఆధ్వర్యంలో పోసాని వైద్య పరీక్షలు నిర్వహించగా, రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు.
అనంతరం పోసానిని రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారంటూ జనసేన నేత జోగినేని మణి రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Details
రైల్వేకోడూరు కోర్టుకు హాజరు కానున్న పోసాని కృష్ణమురళి
ఈ ఫిర్యాదును ఆధారంగా తీసుకుని ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైంది.
వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై బీఎన్‌ఎస్‌లోని 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వైసీపీ పాలనలో ఉన్న సమయంలో, నాటి ప్రభుత్వ పెద్దల అండదండలతో పోసాని కృష్ణమురళి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌తో పాటు ప్రతిపక్షంలోని ఇతర నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, వారి కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో విమర్శలు చేశారు.
ఈ వ్యవహారం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.