LOADING...
Ustad-bhagat-singh: పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌ రెడీ.. నవంబర్‌ చివర్లో ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌!
పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌ రెడీ.. నవంబర్‌ చివర్లో ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌!

Ustad-bhagat-singh: పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌ రెడీ.. నవంబర్‌ చివర్లో ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2025
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం తాజాగా ఒక సూపర్ అప్‌డేట్‌తో హీట్ పెంచేసింది. దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కలయిక అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ అపారమైన ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండడం తెలిసిందే. ప్రస్తుతం పవన్ రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నా, ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తున్నాడట. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈఇద్దరూ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతుండగా, వారి కెమిస్ట్రీ స్క్రీన్‌పై ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్. అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్‌, పవన్ డైలాగ్స్‌, పంచ్‌లు అభిమానులను థియేటర్లలో పిచ్చెక్కించేలా ఉండబోతున్నాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

Details

మొత్తం నాలుగు పాటలు ఫిక్స్ చేసినట్లు సమాచారం

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ఆల్బమ్ పై పెద్ద అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) స్వరపరిచిన సంగీతం ఇప్పటికే పూర్తయిందట. మొత్తం నాలుగు పాటలు ఫిక్స్‌ చేసినట్టు సమాచారం.ప్రతి పాటకూ ప్రత్యేకమైన థీమ్‌ ఉండబోతోందని మ్యూజిక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒకటి మాస్ పబ్లిక్ సాంగ్, ఒకటి లవ్ మెలోడీ, మరోటి పవన్ ఎంట్రీ సాంగ్, చివరిది భావోద్వేగ సాంగ్ రూపంలో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

Details

ఫస్ట్ సింగిల్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు

డీఎస్పీ - పవన్ కలయిక అంటే ఎప్పుడూ మ్యూజిక్ లవర్స్‌కు ట్రీట్‌లాంటిదే. గతంలో 'గబ్బర్ సింగ్', 'జల్సా' సినిమాలకు ఆయన అందించిన మ్యూజిక్‌ ఇప్పటికీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచేలా ఉంది. ఈసారి కూడా పవన్ ఎనర్జీకి తగిన కొత్త బీట్‌లు, ప్రత్యేక రిథమ్‌లతో డీఎస్పీ కష్టపడి పనిచేశారని సమాచారం. ఇక అభిమానులు ఇప్పుడు ఫస్ట్ సింగిల్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లభించిన సమాచారం ప్రకారం, ఆ పాటను నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ ప్రారంభంలో రిలీజ్ చేసే అవకాశం ఉందట. మొత్తానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' మ్యూజిక్ అప్‌డేట్ పవన్ అభిమానుల్లో మళ్లీ హై వోల్టేజ్ ఎనర్జీని నింపేసింది. ఫ్యాన్స్ ఇప్పుడు మరోసారి పవర్‌స్టార్ మానియా కోసం కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టేశారు.