LOADING...
Fauzi: ఆగస్టుకి 'ఫౌజీ' షూటింగ్ పూర్తి..ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
ఆగస్టుకి 'ఫౌజీ' షూటింగ్ పూర్తి..ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Fauzi: ఆగస్టుకి 'ఫౌజీ' షూటింగ్ పూర్తి..ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 18, 2026
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' షూటింగ్ తుది దశకు చేరుకుంది. 'సీతారామం' వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నేపథ్యంలో, అణచివేతకు గురైన ఒక సమాజం నుంచి వెలువడిన వీరుడి కథగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ ఒక ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రసిద్ధి చెందిన ఇమాన్వి ఈ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

వివరాలు

వేగంగా షూటింగ్

ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇప్పటికే 70 శాతం పైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. దర్శకుడు హను రాఘవపూడి తన ప్రత్యేక శైలిలో భావోద్వేగాలను అందంగా మలచడంతో పాటు, యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీతో పాటు పలు ప్రదేశాల్లో భారీ సెట్లు ఏర్పాటు చేసి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక విడుదల తేదీ విషయంలో కూడా అభిమానులకు ఆసక్తికరమైన సమాచారం వినిపిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2026 దసరా సందర్భంగా విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisement