తదుపరి వార్తా కథనం
Prabha Atre: లెజండరీ క్లాసికల్ సింగర్ కన్నుమూత
వ్రాసిన వారు
Stalin
Jan 13, 2024
05:17 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ గాయని ప్రభా ఆత్రే శనివారం కన్నుమూశారు.
ఆమె 91 ఏళ్ల వయసులో పుణేలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అత్రేకు ఉదయం అసౌకర్యంగా అనిపించడంతో దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ ఆమె గుండెపోటు కారణంగా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
సుదీర్ఘ తన కెరీర్‌లో ప్రభా ఆత్రే అనేక మైలురాళ్లను అధిగమించారు. ప్రభా ఆత్రే ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.
ఫైయాజ్ అహ్మద్ ఖాన్ స్మారక అవార్డు, దీనానాథ్ మంగేష్కర్ అవార్డు, ఠాగూర్ అకాడమీ రత్న అవార్డు, పూణే విశ్వవిద్యాలయం జీవితకాల సాఫల్య పురస్కారం, శివసేన నుంచి మహిమ్ రత్న అవార్డును అందుకున్నారు. అత్రే కొన్ని పుస్తకాలను కూడా రచించారు.