Rebal Star : బ్రహ్మరాక్షసుడిగా ప్రభాస్.. మహాశివరాత్రి కానుకగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్?
ఈ వార్తాకథనం ఏంటి
రాజు, రాముడు, రాక్షసుడు, బ్రహ్మరాక్షసుడు ఏ పాత్ర అయినా సరే, ప్రభాస్ కటౌట్‌కి సూపర్‌గా సరిపోతుంది.
బాహుబలిలో రాజుగా, ఆదిపురుష్‌లో రాముడిగా, సలార్‌లో రాక్షసుడిగా ఆకట్టుకున్న ప్రభాస్ ఇప్పుడు బ్రహ్మరాక్షసుడిగా మారనున్నాడనని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా లైనప్ చూస్తే, సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ప్రతీదీ డిఫరెంట్ జానర్‌లో ఉంది. ప్రస్తుతం ఆయన రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
ఇక ఇప్పుడు ప్యాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ వర్మతో సినిమా చేయనున్నట్లుగా అఫీషియల్‌గా ఫిక్స్ అయ్యిందని సమాచారం.
Details
జై హనుమాన్ చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రశాంత్ వర్మ
హనుమాన్‌తో ఘన విజయం సాధించిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
అంతేకాదు, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యత కూడా తీసుకున్నా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పక్కనపెట్టినట్టుగా తెలుస్తోంది.
ఇదే సమయంలో ప్రశాంత్ వర్మ - ప్రభాస్ కాంబినేషన్ సెట్ అవ్వడం విశేషం. ఇంతకు ముందు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో 'బ్రహ్మరాక్షస్' అనే కథను తెరకెక్కించాలనుకున్నా అది వర్కౌట్ కాలేదు.
అయితే ఇప్పుడు అదే కథను ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి అనుగుణంగా మార్చి తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Details
ఇవాళ అనౌన్స్ చేసే అవకాశం?
అంతేకాదు ప్రభాస్ లుక్ టెస్ట్ కూడా జరిగిందని, మహాశివరాత్రి కానుకగా ఈ రోజు అధికారికంగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను హోంబలే ఫిల్మ్స్ నిర్మించనుంది. సలార్ సినిమాతో ప్రభాస్‌కి భారీ హిట్ అందించిన ఈ నిర్మాణ సంస్థ, ఇప్పుడు మరో బిగ్ బడ్జెట్ విజువల్ వండర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుందని అంచనా.
మరి ప్రభాస్ - ప్రశాంత్ వర్మ కాంబోలో బ్రహ్మరాక్షసుడు ఎలాంటి విజువల్ ట్రీట్ ఇవ్వనుందో వేచి చూడాలి!