Salaar 2 : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. 'సలార్ 2' షూటింగ్ రెడీ!
ఈ వార్తాకథనం ఏంటి
కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ 'సలార్' భారీ సక్సెస్ సాధించింది. ప్రభాస్ టైటిల్ రోల్‌లో నటించిన 'సలార్ పార్ట్ 1' గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామి వసూళ్లను సృష్టించింది.
ఈ సందర్భంగా, ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా ప్రేమికులు 'సలార్ 2' ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రభాస్ అభిమానులకు ఆ సినిమా గురించి తాజా అప్డేట్ అందింది. సలార్ 2 షూటింగ్ ప్రారంభమైందని ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
హోంబలే ఫిలిమ్స్ ప్రకటించిన ఈ మోస్ట్ ఎవెయిటెడ్ సీక్వెల్‌లో ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్విరాజ్ కలిసి పనిచేస్తున్నారు.
Details
డిసెంబర్ 2025లో మూవీ రిలీజ్
ప్రభాస్ ఈ షెడ్యూల్‌లో 20 రోజుల పాటు పాల్గొంటారని తెలిసింది. 'సలార్ 2' ను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రాన్ని 2025 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు వెల్లడించాయి. ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నటి శ్రియారెడ్డి ట్వీట్ చేసింది.
'త్వరలోనే సెట్స్‌లో కలుద్దాం' అని ఆమె పేర్కొంది. సలార్ 2లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా, శ్రియారెడ్డి, టిన్ను ఆనంద్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మాలీవుడ్ యాక్టర్ షైన్ టామ్ చాకో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు ఉన్నాయి, అయితే మేకర్స్ నుండి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.