Page Loader
The RajaSaab: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్: 'రాజాసాబ్' మోషన్ పోస్టర్ తో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్

The RajaSaab: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్: 'రాజాసాబ్' మోషన్ పోస్టర్ తో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2024
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'ది రాజాసాబ్‌'. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ అందించింది. ప్రభాస్ స్టైలిష్ లుక్‌లో కనిపించిన ఒక స్పెషల్ వీడియోతో మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా హారర్, కామెడీ నేపథ్యంతో తెరకెక్కుతోంది. ప్రభాస్ అభిమానులు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ అప్‌డేట్స్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్‌ లుక్‌ పోస్టర్‌ సెన్సేషన్‌గా మారగా, తాజాగా విడుదలైన వీడియో కూడా భారీ స్పందనను అందుకుంది. 'ది రాజాసాబ్' ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది.