Spirit: ప్రభాస్-డాన్ లీ కలయిక.. హైప్ పెంచే 'స్పిరిట్' అప్డేట్ రాబోతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపొందుతున్న 'స్పిరిట్' సినిమా కోసం అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సోషల్ మీడియాలో రోజూ ఈ సినిమా క్యాస్టింగ్ సంబంధించిన వార్తలు వైరల్ అవుతూ ఉంటే, తాజాగా చిత్రబృందం కొరియన్ స్టార్ డాన్ లీను స్పెషల్ క్యామియో రోల్ కోసం సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు చిత్రబృందం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిజానికి సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లోని క్యారెక్టర్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. డాన్ లీ స్పిరిట్ సినిమాలో భాగమైతే, వెండి తెరపై నిప్పులు చెలరేగే సీన్స్ ఆడియన్స్‌కు కనిపిస్తాయని చెప్పారు.
Details
మార్చి 1న కీలక అప్డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డాన్ లీ వంటి అంతర్జాతీయ స్టార్‌లు వెండి తెరపై కలిసి కనిపిస్తే, ఈ సినిమా స్థాయి మరో లెవల్‌కు చేరుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సందీప్ వంగా రాసే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు సినిమాల్లో ఎంత ఇంపాక్ట్ కలిగిస్తాయో, 'యానిమల్' సినిమాతో అందరికీ స్పష్టంగా అర్థమైంది. డాన్ లీ ఈ క్యామియోలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే, మార్చి 1న ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉందని సినీ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఈ సినిమాలో కీ రోల్ విలన్‌గా బాలీవుడ్ స్టార్ వివేక్ ఓబెరాయ్ ప్రభాస్‌ను ఎదుర్కొంటున్నారంటూ జోరుగా వార్తలు లీక్ అవుతున్నాయి.
Details
త్వరలోనే అధికారిక ప్రకటన
త్వరలోనే చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశముంది. రోజుకో వైరల్ వార్తలతో 'స్పిరిట్' సినిమా పై సోషల్ మీడియాలో హైప్ మామూలుగా కాదు. సందీప్ రెడ్డి వంగా-ప్రభాస్ కాంబినేషన్‌లో ఈ సినిమా రాబోతుండటం వల్ల, డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినిమాప్రేమికులు కూడా భారీ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.