Prabhas-Donation-Tollywood: టాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు 35 లక్షల విరాళం
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా(Pan India)వరుస చిత్రాల్లో నటిస్తూ రోజురోజుకు తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)గత ఏడాది సలార్(Salaar)మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.
ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేయడమే కాకుండా పలు సామాజిక సేవా కార్యక్రమా (Social Activities) ల్లోనూ తరచు పాల్గొంటూ ఉంటారు.
ఆయన పెట్టే భోజనం కోసం షూటింగ్ సెట్లో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారంటే అతిశయోక్తి కాదు.
ఈ విషయాన్ని చాలామంది టాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్లు ఏదో ఒక సందర్భంలో బాహాటంగానే చెప్పారు.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు.
టాలీవుడ్ డైరెక్టర్స్ ఫిల్మ్ అసోసియేషన్ కు ప్రభాస్ 35 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
Prabhas-Donation-TFDA
దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా..
దివంగత దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4వ తేదీని డైరెక్టర్స్ డే గా టాలీవుడ్ డైరెక్టర్స్ ఫిల్మ్ అసోసియేషన్ వేడుకలు నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా వచ్చే నెల 4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే వేడుకలను నిర్వహించేందుకు టాలీవుడ్ డైరెక్టర్స్ అసోసియేషన్ నిర్ణయించింది.
విషయం తెలుసుకున్న ప్రభాస్ వెంటనే టిఎఫ్ డిఏ (TFDA) కు 35 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
ఈ విషయాన్ని టాలీవుడ్ దర్శకుడు మారుతి మీడియాకు వెల్లడించారు.
ఇంతటి మనసున్న ప్రభాస్ 35లక్షల రూపాయలను టీఎఫ్ డీఏకు విరాళం ఇవ్వడం ద్వారా మరోసారి తన వితరణ శీలతను ప్రదర్శించారు.