
Prabhas: యూరప్‌లో మోకాలి ఆపరేషన్ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన ప్రభాస్
ఈ వార్తాకథనం ఏంటి
బాహుబలితో ప్యాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటిన డార్లింగ్ 'ప్రభాస్'.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ప్రభాస్ కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ప్రభాస్ తన బిజీ షెడ్యూల్ నుంచి కొంత విరామం తీసుకుని మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవాడానికి యూరప్ వెళ్లాడు.
ఈ క్రమంలో యూరప్‌లో మోకాలి ఆపరేషన్‌ను విజయవంతంగా చేయించుకొని.. బుధవారం ఇండియాకు తిరిగొచ్చాడు. ఈ విషయాన్ని సినిమా విశ్లేషకులు మనోబాల విజయాబాలన్ ట్విట్టర్ వేదికా చెప్పారు.
ప్రభాస్ బ్లాక్ కలర్ దుస్తులు, మాస్క్ ధరించి ఎయిర్‌పోర్టులో కనిపించాడు. ప్రభాస్ ఎయిర్‌పోర్టులో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రభాస్
ప్రభాస్ కెరీర్‌కు 'సలార్' చాలా కీలకం
ప్రస్తుతం ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె', 'సలార్ పార్ట్ 1, 'రాజా డీలక్స్', 'స్పిరిట్' వంటి పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలో మోకాలి నొప్పి చాలా తీవ్రం కావడంతో డాక్టర్ల సూచన మేరకు ప్రభాస్ ఆపరేషన్ చేయించుకున్నాడు.
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో 'సలార్' మొదట విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌కు ఈ సినిమా చాలా కీలకం. ప్రభాస్ గత చిత్రం 'ఆదిపురుష' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో సాలార్ విడుదల కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నినీ విశ్లేషకులు మనోబాల ట్వీట్
Pan India Star #Prabhas is back in India after a successful knee surgery in Europe.
— Manobala Vijayabalan (@ManobalaV) November 8, 2023
The star's upcoming film #Salaar clashing with #ShahRukhKhan's #Dunki is all… pic.twitter.com/uQpmSof3mP