LOADING...
The Rajasaab: ప్రభాస్‌ హారర్‌ కామెడీ మూవీ 'ది రాజాసాబ్‌' ట్రైలర్‌ విడుదల

The Rajasaab: ప్రభాస్‌ హారర్‌ కామెడీ మూవీ 'ది రాజాసాబ్‌' ట్రైలర్‌ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2025
06:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో ప్రభాస్‌ నటిస్తున్న హారర్‌ కామెడీ మూవీ 'ది రాజాసాబ్‌' (The Rajasaab) సినీ అభిమానులకి భారీ ఆకర్షణగా మారింది. అభిమానులు ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ (The Rajasaab Trailer) సోమవారం సాయంత్రం విడుదలైంది. ట్రైలర్‌లో ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్స్‌, గ్రాఫిక్స్‌, విజువల్స్ హైలైట్స్‌గా కనిపించాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ ప్రధాన హీరోయిన్‌లుగా నటించారు. అదేవిధంగా బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్‌దత్‌ కీలక పాత్రలో ఉన్నారు. ఈ మూవీ 2026 సంక్రాంతి పండుగలో ప్రేక్షకుల ముందుకు రానుందని నిర్మాతలు ప్రకటించారు.