Page Loader
Prabhas: ప్రభాస్ ఓ జోకర్.. 'కల్కి'పై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు
ప్రభాస్ ఓ జోకర్.. 'కల్కి'పై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు

Prabhas: ప్రభాస్ ఓ జోకర్.. 'కల్కి'పై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2024
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో రికార్డులను సృష్టించి, పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. ప్రభాస్ తాజాగా నటించిన 'కల్కి' చిత్రం వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అయితే ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కల్కిలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందని ఆర్షద్ వార్సీ పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్ పోలిస్తే, ప్రభాస్ పాత్ర తేలిపోయిందన్నారు.

details

అర్షద్ వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం

అమితాబ్ ఈ వయస్సులో కల్కి లాంటి సినిమాలు చేస్తుంటే, ఆయనలో ఉన్న శక్తిలో కొంచెమైనా తనలో ఉంటే లైఫ్ సెట్ అయిపోతుందన్నారు. మ్యాడ్ మ్యాక్స్ తరహాలో ప్రభాస్ పాత్ర ఉంటుందని ఆశించానని పేర్కొన్నారు. ఇక ప్రభాస్ తెరపై చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందన్నారు. ప్రస్తుతం అర్షద్ చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.