LOADING...
Prabhas : వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ప్రభాస్.. మరో పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధం!
వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ప్రభాస్.. మరో పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధం!

Prabhas : వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ప్రభాస్.. మరో పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2026
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌ ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన చేతిలో అనేక క్రేజీ ప్రాజెక్టులు ఉండగా, మరికొన్ని కొత్త సినిమాలు కూడా లైనప్‌లో చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఆ ఫోటోలో ప్రభాస్‌తో పాటు మలయాళ యువ దర్శకుడు దింజిత్ అయ్యతన్ కనిపించడం ప్రత్యేకంగా చర్చకు కారణమైంది. సాధారణంగా అభిమానులు ప్రభాస్ లుక్ గురించి మాట్లాడుకుంటుండగా, కొందరు మాత్రం ఆయనతో ఉన్న దర్శకుడి గురించి చర్చిస్తున్నారు. ఇటీవల ప్రేక్షకులను ఏకో అనే సినిమాతో ఆకట్టుకున్న దిన్జీత్ అయ్యాథన్, ఆ చిత్రంతో మంచి స్పందన పొందారు.

Details

ప్రభాస్‌ను కలవడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది

దీంతో ఆయనపై సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక దృష్టి పడింది. అలాంటి దర్శకుడు ప్రభాస్‌ను కలవడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ భేటీ తర్వాత సోషల్ మీడియాలో ఒక క్రేజీ బజ్ మొదలైంది. ప్రభాస్ తన భవిష్యత్ ప్రాజెక్టుల జాబితాలో దిన్జీత్ అయ్యాథన్‌తో కూడా ఒక సినిమా చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ నిజమైతే అభిమానులకు ఇది ఊహించని సర్‌ప్రైజ్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర అంశం కూడా వినిపిస్తోంది. ప్రభాస్ నటించిన స‌లార్‌ సినిమాను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ ఈ కొత్త ప్రాజెక్ట్‌ను కూడా నిర్మించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

Details

అధికారిక ప్రకటన వెలువడలేదు

అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'సలార్' భారీ విజయంతో ఆయనపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలపై అభిమానులు భారీ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ - దిన్జీత్ అయ్యాథన్ కాంబినేషన్‌లో నిజంగా సినిమా తెరకెక్కుతుందా? లేక ఇది కేవలం ఒక సాధారణ భేటీ మాత్రమేనా? అనే విషయంపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయినప్పటికీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement